కోలీవుడ్ నటుడు సత్యరాజ్ ఇంట్లో పెను విషాదం నెలకొంది. సత్యరాజ్ తల్లి నాథంబాల్ కన్నుమూశారు. ఆమె వయసు 94. గత కొన్నేళ్లుగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె ఈరోజు కోయంబత్తూరులోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో సత్యరాజ్ ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి. హైదరాబాద్లో షూటింగ్లో ఉన్న సత్యరాజ్ తన తల్లి మరణవార్త విన్న వెంటనే కోయంబత్తూర్కు బయలుదేరినట్లు సమాచారం. సత్యరాజ్ తల్లి మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. సత్యరాజ్ బాహుబలిలో కట్టప్పగా తన నటనతో మెప్పించాడు.