దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ కాంబినేషన్ లో వచ్చిన 'సీతారామం' చిత్రం గతేడాది విడుదలై ఘన విజయం సాధించింది. తాజాగా ఈ చిత్రానికి ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది. 'ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్ బోర్న్' ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. మెలిబోర్న్ వేదికగా ప్రారంభమైన ఈ వేడుకలను దర్శకుడు కరణ్ జోహార్, హీరో కార్తీక్ ఆర్యన్, నటి మృణాల్ ఠాకూర్ తదితరులు ప్రారంభించారు. ఈ వేడుకలు ఈ నెల 20 వరకు జరగనున్నాయి.