సీనియర్ నటుడు సత్యరాజ్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి నాదాంబాళ్ కాళింగయార్ శుక్రవారం రోజు మృతిచెందారు. 94 ఏళ్ల ఆమె వృద్ధాప్యం కారణంగా కన్నుమూశారు. ఈ ఘటన జరిగిన సమయంలో సత్యరాజ్ హైదరాబాద్ లో షూటింగ్ లో ఉండగా, విషయం తెలిసిన వెంటనే కోయంబత్తూరుకు బయలుదేరి వెళ్లారు. ఆమెకు సత్యరాజ్ తో పాటు కల్పనా మండ్రాడియర్, రూపా సేనాధిపతి అని ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.