కోలీవుడ్ బ్యూటీ ఆండ్రియా జెర్మియా బోల్డ్ కామెంట్స్ చేశారు. ఆ చిత్రంలో అర్థనగ్నంగా నటించాను అందులో తప్పేంటని ఆమె వెల్లడించారు. యాక్టర్ కమ్ సింగర్ ఆండ్రియా జీవితంలో పలు వివాదాలు ఉన్నాయి. సుచి లీక్స్ లో ఆమె పేరు ప్రధానంగా వినిపించింది. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ తో ఆండ్రియా సన్నిహితంగా ఉన్న ఫోటోలు బయటకు వచ్చాయి. వీరి మధ్య ఎఫైర్ ఉన్నట్లు వార్తలు వెలువడ్డాయి. ప్రస్తుతం ఆండ్రియా నటిగా బిజీగా ఉన్నారు. అరడజనుకు పైగా చిత్రాలు ఆమె చేతిలో ఉన్నాయి. వెంకటేష్ లేటెస్ట్ మూవీ సైంధవ్. దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో ఆండ్రియా కీలక రోల్ చేస్తుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. సైంధవ్ పాన్ ఇండియా మూవీ కాగా ఐదు ప్రధాన భాషల్లో విడుదల చేస్తున్నారు. అలాగే పిశాచి 2, కా, మాళిగై, నో ఎంట్రీ వంటి చిత్రాల్లో ఆమె నటిస్తుంది. మరి కొన్ని ప్రాజెక్ట్స్ ఆమె చేతిలో ఉన్నాయి. సింగర్ గా కూడా ఆమె రాణిస్తున్నారు. ఆండ్రియా గత చిత్రం అనెల్ మెలే పని తుల్లి. ఆండ్రియా ప్రధాన పాత్ర చేసింది. ఈ లేడీ ఓరియెంటెడ్ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు వెట్రిమారన్ నిర్మించారు. ఆర్. కైసర్ ఆనంద్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో ఆండ్రియా అర్థనగ్నంగా నటించగా కొన్ని విమర్శలు ఎదుర్కొన్నారు. తాజాగా దీనిపై ఆండ్రియా స్పందించారు. అవును అనెల్ మెలే పని తుల్లి చిత్రంలో నేను అర్థనగ్నంగా నటించాను. ఆ సన్నివేశం చేసేటప్పుడు నాకే భయంగా అనిపించింది. అయినా అర్థనగ్నంగా నటించడంలో తప్పేముంది. నా నిజ జీవితంలో అంతకంటే ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని ఆండ్రియా అన్నారు. ఆండ్రియా కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.