ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘నీవే నీవే నీవే నేనంటా’ సాంగ్ లిరిక్స్

cinema |  Suryaa Desk  | Published : Thu, Aug 17, 2023, 09:48 AM

నీవే నీవే నీవే నేనంటా. నీవే లేక నేనే లేనంటా.
వరమల్లే అందిందేమో ఈ బంధం.ఓఓ.
వెలలేని సంతోషాలే నీ సొంతం
నీవే నీవే నీవే నేనంటా. నీవే లేక నేనే లేనంటా.

నా కలలని కన్నది నీవే నా మెలకువ వేకువ నీవే
ప్రతి ఉదయం వెలుగయ్యింది నీవేగా.
నా కష్టం నష్టం నీవే చిరునవ్వు దిగులు నీవే
ప్రతి నిమిషం తోడై ఉంది నీవేగా
కనిపించకపోతే బెంగై వెతికేవే. కన్నీరే వస్తే కొంగై తుడిచేవే

నీవే నీవే నీవే నేనంటా. నీవే లేక నేనే లేనంటా.

నే గెలిచిన విజయం నీదే. నే ఓడిన క్షణమూ నాదే.
నా అలసట తీరే తావే నీవేగా
అడుగడుగున నడిపిన దీపమ ఇరువురికే తెలిసిన స్నేహమ
మది మురిసే ఆనందాలే నీవేగా.
జన్మిస్తే మళ్ళీ నీవై పుడతాలే. ధన్యోస్మీ అంటూ దణ్ణం పెడతాలే

నీవే నీవే నీవే నేనంటా. నీవే లేక నేనే లేనంటా.
వరమల్లే అందిందేమో ఈ బంధం.ఓఓ.
వెలలేని సంతోషాలే నీ సొంతం
నీవే నీవే నీవే నేనంటా. నీవే లేక నేనే లేనంటా.
వరమల్లే అందిందేమో ఈ బంధం.ఓఓ.
వెలలేని సంతోషాలే నీ సొంతం
నీవే నీవే నీవే నేనంటా. నీవే లేక నేనే లేనంటా






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com