ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బ్లాక్‌ డ్రెస్‌లో బేబమ్మ తెగింపు

cinema |  Suryaa Desk  | Published : Thu, Aug 17, 2023, 10:51 AM

ఓవర్‌ నైట్‌లో స్టార్‌ అయిపోయింది కృతి శెట్టి. అంతే వేగంగా ఆమె ఇప్పుడు తెలుగుకి దూరమవుతుంది. యంగ్‌ హీరోలందరితోనూ రొమాన్స్‌ చేసి ఓ చుట్టేసిన ఈ భామ ఇప్పుడు తనలోని మరో యాంగిల్‌ని బయటపెడుతుంది. `ఉప్పెన` చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది కృతి శెట్టి. తొలి చిత్రంతోనే సంచలన విజయాన్ని అందుకుంది. `ఉప్పెన` విజయం ఇండస్ట్రీకి పెద్ద బూస్ట్ ఇచ్చింది. కరోనా అనంతరం ఈ రేంజ్‌ కలెక్షన్లు సాధించిన చిత్రం కావడంతో అంతా ఆశ్చర్యపోయారు. ఈ సినిమాతో హీరో వైష్ణవ్‌ తేజ్‌, హీరోయిన్‌ కృతి శెట్టి, దర్శకుడు బుచ్చిబాబు చిత్ర పరిశ్రమకి పరిచయం అయ్యారు. అంతా కొత్తవాళ్లు కలిసి సంచలనం సృష్టించారు. ఈ సినిమా విడుదలకు ముందే పాపులర్ అయ్యింది కృతి శెట్టి. ఆమె పాటల్లో మెరిసినప్పుడు కుర్రాళ్ల హృదయాలను కొల్లగొట్టింది. ఆ క్యూట్‌ లుక్స్ తో మంత్రముగ్దుల్ని చేసింది. సాంగ్స్ లో ఆమె అందాలు, ఎక్స్ ప్రెషన్స్ హైలైట్‌గా నిలిచాయి. దీంతో కుర్రాళ్లు మొత్తం ఆమెకి పడిపోయారు. ఇక సినిమా రిలీజ్‌ అయ్యాక అభిమానులుగా మారిపోయారు. తొలి చిత్రంతోనే అద్భుతంగా చేసి మెప్పించింది. అందులో భాగంగా ఇప్పుడు మరోసారి రెచ్చిపోయింది. బ్లాక్‌ టీషర్ట్ ధరించి పిచ్చెక్కించే పోజులిచ్చింది. క్లోజప్‌లో కిల్లర్‌ లేడీలా మారిపోయింది. మత్తెక్కించే చూపులతో టెంప్ట్ చేస్తుంది. కృతి శెట్టి కసి చూపులకు కుర్రాళ్ల బేజారెత్తిపోతున్నారు. దీనిపై స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. కి్లలర్‌ లుక్స్ తో కరెంట్‌షాక్‌ కొడుతుందని అంటున్నారు. బాబోయ్‌ బేబమ్మలో ఇంత ఘాటు ఉందా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 


 


 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com