బాలీవుడ్ నటుడు, బీజేపీ ఎంపీ సన్నీ డియోల్‌కు చెందిన విల్లా వేలం ప్రక్రియను బ్యాంక్ ఆఫ్ బరోడా సోమవారం ఉపసంహరించుకుంది. సాంకేతిక సమస్యల కారణంగా ఈ-వేలం నోటీసును రద్దు చేస్తున్నామని బీవోబీ ప్రకటన విడుదల చేసింది. బ్యాంకుకు చెల్లించాల్సిన దాదాపు రూ.56 కోట్ల రుణాన్ని ‘సెటిల్’ చేసుకునేందుకు ఆయన ముందుకు వచ్చారని తెలిపింది. కాగా వేలం నోటీసును హఠాత్తుగా రద్దు చేయటాన్ని కాంగ్రెస్ నాయకుడు జైరాం రమేశ్ తప్పుబట్టారు.