తెలుగు సినిమాతోనే నటిగా కెరీర్ ప్రారంభించిన కృతి కర్బందా (Kriti Kharbanda) తాజాగా తనకు కలిగిన ఓ ఛేదు అనుభవాన్ని వెల్లడించింది. ఆ చిత్రంలో నటిస్తున్న సమయంతో.. తన గదిలో సీక్రెట్ కెమెరాలను పెట్టారని.. చాలా భయమేసిందని చెప్పుకొచ్చింది.ఢిల్లీ బ్యూటీ, బాలీవుడ్ నటి కృతి కర్బందా టాలీవుడ్ చిత్రం ‘బోణీ’తోనే నటిగా కెరీర్ ప్రారంభించింది. తొలినాళ్లలో సౌత్ చిత్రాల్లో బాగా మెరిసింది. తెలుగుతో పాటు కన్నడలో ఎక్కువగా సినిమాలు చేసింది. ఆ తర్వాత బాలీవుడ్ లో అడుగుపెట్టి అక్కడే సెటిల్ అయ్యింది. ఢిల్లీ బ్యూటీ, బాలీవుడ్ నటి కృతి కర్బందా టాలీవుడ్ చిత్రం ‘బోణీ’తోనే నటిగా కెరీర్ ప్రారంభించింది. తొలినాళ్లలో సౌత్ చిత్రాల్లో బాగా మెరిసింది. తెలుగుతో పాటు కన్నడలో ఎక్కువగా సినిమాలు చేసింది. ఆ తర్వాత బాలీవుడ్ లో అడుగుపెట్టి అక్కడే సెటిల్ అయ్యింది. ప్రస్తుతం సౌత్ సినిమాలకు ఈ ముద్దుగుమ్మ దూరంగా ఉంటోంది. అటు బాలీవుడ్ లోనూ రెండేళ్లుగా ఎలాంటి సినిమా చేయలేదు. అయితే, తెలుగు, హిందీలో కంటే.. ఈ బ్యూటీ కన్నడలో ఎక్కువ సినిమాలు చేసింది. తన నటనతో అక్కడి ఆడియెన్స్ ను అలరించింది. తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. అయితే, కన్నడలో ఓ సినిమా చేస్తుండగా తనకు ఎదురైన ఓ ఘటనను తాజాగా ఇంటర్వ్యూలో వెల్లడించింది. కృతి కర్బందా మాట్లాడుతూ.. ‘నేను ఓ కన్నడ మూవీ షూటింగ్ చేస్తున్నాను. నాకు ఓ హోటల్ లో ఉండేందుకు ఏర్పాట్లు చేశారు. అక్కడే పనిచేసే ఓ వ్యక్తి నా రూమ్ లో సీక్రెట్ గా కెమెరా పెట్టారు. స్టే చేసే రూమ్ ను చెక్ చేసుకోవడం నాకు, నా టీమ్ కు అలవాటు. అలా నా గదిని మొత్తం పరిశీలించగా.. సెటప్ బాక్స్ వెనకాల కెమెరా గుర్తించాం. అది చూసి షాక్ అయ్యాం. అప్పటి నుంచి ఇంకెక్కడైనా బస చేయాలంటే చాలా జాగ్రత్తగా ఉంటున్నాను’. అని చెప్పుకొచ్చింది. సౌత్ సినిమాలపై మక్కువ ఉన్న ఈ ముద్దుగుమ్మకు ఇలా అనుభవం కలగడం బాధాకరమని అంటున్నారు.