కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీని ఒకప్పుడు రీజనల్ మార్కెట్ గా కూడా గుర్తించే వారు కాదు. డబ్బింగ్ సినిమాలు, రీమేక్ సినిమాలతో కన్నడ సినిమా కర్ణాటక ల్యాండ్ కి మాత్రమే పరిమితం అయ్యింది.శివ రాజ్ కుమార్, కిచ్చా సుదీప్, ఉపేంద్ర, దర్శన్ లాంటి స్టార్ హీరోలు ఉన్నా కూడా తక్కువ బడ్జెట్ లో తక్కువ క్వాలిటీ ఉండే సినిమాలే కన్నడ నుంచి ఎక్కువగా వచ్చాయి. అందుకే సౌత్ ఆడియన్స్ కూడా కన్నడ ఫిల్మ్స్ ని పెద్దగా పట్టించుకోలేదు. ఇలాంటి సమయంలో పాన్ ఇండియా మొత్తాన్ని కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ వైపు తిరిగి చూసేలా చేసాయి KGF, కాంతర, చార్లీ సినిమాలు. KGF కన్నా ఎక్కువగా కాంతర సినిమా మరింత కల్చరల్ ఇంపాక్ట్ చూపించింది.
కర్ణాటకాలో మాత్రమే రిలీజ్ అయిన కాంతార సినిమా, నెమ్మదిగా పాజిటివ్ టాక్ తో వైల్డ్ ఫైర్ లా ఇండియా మొత్తం స్ప్రెడ్ అయ్యింది. ఇప్పుడు ఇలాంటి మ్యాజిక్ నే కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో మరొకటి జరుగుతుంది. వెర్సటైల్ యాక్టర్ రాజ్ బి శెట్టి నటించిన ‘టోబి’ సినిమా కర్ణాటకాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ మూవీ అన్ని సెంటర్స్ లో సూపర్బ్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. సినిమా బాగుంది అనే టాక్ వైల్డ్ ఫైర్ లా స్ప్రెడ్ అవుతూ ఉంది. ఆగస్టు 25న రిలీజ్ అయిన టోబి మూవీ టాక్ వారం తిరగకుండానే ఇతర ప్రాంతాలకి కూడా స్ప్రెడ్ అయ్యింది. మేకర్స్ ఈ మూవీని డబ్ చేసి రిలీజ్ చేస్తే ఇతర ఇండస్ట్రీల దగ్గర కూడా మంచి కలెక్షన్స్ ని రాబట్టే ఛాన్స్ ఉంది. మరి ఈ మూవీని మేకర్స్ ఎప్పుడు ఇతర భాషల్లో రిలీజ్ చేస్తారు? కాంతర రేంజులో టోబి ఇంపాక్ట్ చూపిస్తుందా లేదా అనేది చూడాలి.