చిన్న సినిమాగా విడుదలపై కోట్లు కొల్లగొట్టిన సినిమా 'బేబీ'. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా రూ.90 కోట్ల (గ్రాస్) వసూళ్లను రాబట్టింది. తాజాగా ఆహా ఓటీటీ ‘వాట్సాప్ బేబీ’ పేరుతో హీరోయిన్ వైష్ణవి చైతన్య వీడియో పంచుకుంది. అందులో ఆనంద్, విరాజ్లలో ఒకరిని పెళ్లి చేసుకోవాలనుకుంటే ఎవరిని చేసుకుంటావ్? అని అడగ్గా, ‘ఇద్దరినీ కాదు.. ఒక్కొక్కరిలో ఒక్కో క్వాలిటీ తనకు నచ్చుతుంది' చెప్పుకొచ్చింది.