మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన 'తిరగబడరా సామీ’ చిత్రం టీజర్ రిలీజ్ ఈవెంట్లో నటి మన్నారా చోప్రాకు దర్శకుడు ఎ.ఎస్. రవికుమార్ చౌదరి ముద్దుపెట్టుకోవడం నెట్టింట చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. ఈ వివాదంపై తాజాగా రవికుమార్ స్పందించారు. ఈ మేరకు ఓ ట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్లూలో ఆయన వివరణ ఇచ్చారు. ‘‘నా సినిమాలో నిజాయతీగా పని చేసిన అమ్మాయి తను. ఆమెను ముద్దు పెట్టుకుంటే తప్పేంటి..? ఆప్యాయతతోనే అలా చేశా. నా కూతురును కూడా అలాగే ముద్దుపెట్టుకుంటా. ఆ విషయాన్ని కూడా తప్పుపడతారా? నిజం చెప్పాలంటే సినిమా షూటింగ్ మొదలైన రెండు రోజులు ఆమె పనితీరు నాకు నచ్చలేదు. గట్టిగా మాట్లాడదాం అంటే బాలీవుడ్లో పెద్ద కుటుంబానికి చెందిన అమ్మాయి అని చెప్పి చూశా. ఆ తర్వాత నా స్టైల్లో కాస్త గట్టిగానే ఆ రోజు నుంచి సెట్లో పర్ఫెక్ట్ పని చేసింది. నిజంగా ఈ సినిమా కోసం ఆమె ఎంతో కష్టపడింది. తన వర్క్ నచ్చడంతో కృతజ్ఞతతో, ఆప్యాయంగా ఆమెకు ముద్దు పెట్టాను. ఆ నటికి, నా కుటుంబానికి, నా భార్యకు లేని ఇబ్బంది మిగతావాళ్లకు ఎందుకు?’’ అని రవికుమార్ మండిపడ్డారు. యజ్ఞం’, ‘పిల్లా నువ్వు లేని జీవితం’, ‘ఆటాడిస్తా’, ‘సౌఖ్యం’ వంటి చిత్రాలతో దర్శకుడిగా గుర్తింపు పొందారు రవికుమార్ చౌదరి. రాజ్‌తరుణ్, మాల్వీ మల్హోత్ర, మన్నారా చోప్రా కీలక పాత్రధారులుగా యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమా టీజర్ విడుదల సమయంలో ఫొటో పోజిచ్చే సమయంలో మన్నారా పక్కనే ఉన్న రవికుమార్ ఆమెపై చేయి వేసి.. బుగ్గపై ముద్దు పెట్టారు. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారడంతో ఆయన్ను కొందరు నెటజన్లు తప్పుబట్టారు.