బాలకృష్ణ అభిమానులకు మరోసారి నిరాశ ఎదురైంది. ఆయన కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ చిత్రాల్లో ఒకటిగా నిలిచిన ‘భైౖరవద్వీపం’ చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. దీని కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మొదట ఆగస్టు 5న రిలీజ్ చేయాలని భావించారు. కానీ, కొన్ని కారణాల వల్ల దాన్ని ఆగస్టు 30వ తేదీకి వాయిదా వేశారు. నిర్మాతల ప్రకటన ప్రకారం బుధవారం ఈ చిత్రం విడుదల కావాల్సి ఉంది. కానీ కాకపోవడంతో అభిమానులకు నిరాశ ఎదురైంది. దానికి గల కారణాన్ని తెలుపుతూ నిర్మాత ఓ నోట్ విడుదల చేశారు. ‘‘భైరవద్వీపం’ సినిమాకు ఆధునిక హంగులు అద్ది 4కె రిజల్యూషన్‌తో ప్రేక్షకులకు అందించాలని ప్రయత్నం చేశాం. ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాలు 4కెలోకి మారడం కష్టమైంది ఈ సాంకేతిక సమస్యతో విడుదల మరోసారి వాయిదా పడింది. ది బెస్ట్ అవుట్‌పుట్ కోసం ప్రయత్నిస్తున్నాం. త్వరలోనే కొత్త తేదీని ప్రకటిస్తాం అని ఆ పేర్కొన్నారు. ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ కథానాయికుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘భగవంత్ కేసరి’లో నటిస్తున్నారు. కాజల్ కథానాయికగా, శ్రీలీల కీలక పాత్రలో నటిస్తున్నారు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రం అక్టోబర్ 19న విడుదల కానుంది.