పెళ్ళైనప్పటికీ కాజల్ గ్లామర్, ఫేమ్ ఏం తగ్గలేదు. వన్నె తరగని అందాలతో ఆమె మెస్మరైజ్ చేస్తుంది. మరో పదేళ్లు హీరోయిన్ రోల్స్ చేస్తుందేమో అనిపిస్తుంది. ఈ స్టార్ లేడీ పరిశ్రమకు వచ్చి చాలా కాలం అవుతుంది. లాంగ్ కెరీర్ అనుభవిస్తున్న ఈ తరం హీరోయిన్స్ లో కాజల్ ఒకరు. వివాహమైనా కూడా ఆమెకు డిమాండ్ తగ్గలేదు. 2007లో విడుదలైన లక్ష్మీ కళ్యాణం మూవీతో కాజల్ అగర్వాల్ హీరోయిన్ అయ్యారు. దర్శకుడు తేజా ఆమెను పరిశ్రమకు పరిచయం చేశారు. కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లక్ష్మీ కళ్యాణం అంతగా ఆడలేదు. దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కించిన చందమామ మూవీతో మొదటి హిట్ అందుకుంది. మగధీర మూవీతో స్టార్ హీరోయిన్ అయ్యారు. మగధీర అనంతరం కాజల్ కెరీర్ జెట్ స్పీడ్ తో దూసుకుపోయింది. తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ అయ్యారు. టాప్ స్టార్స్ పక్కన నటించారు. బాలీవుడ్ లో కూడా చిత్రాలు చేశారు.
#KajalAggarwal pic.twitter.com/XjuJh5ja2P
— VD bulletin (@vdbulletin) September 3, 2023