నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన 'జైలర్' సినిమా అద్భుతమైన విజయం తర్వాత సూపర్ స్టార్ తదుపరి ప్రాజెక్ట్ కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈరోజు సూపర్ స్టార్ తదుపరి సినిమా గురించిన అధికారిక ప్రకటన వెలువడింది. ప్రస్తుతం లియో పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న దర్శకుడు లోకేష్ కనగరాజ్ రజనీకాంత్ తదుపరి చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఈ విషయాన్ని సన్ పిక్చర్స్ అధికారికంగా ఒక పోస్టర్‌ను విడుదల చేసి ప్రకటించింది.
తలైవర్ 171 అని తాత్కాలికంగా పేరు పెట్టబడిన ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నారు. అన్బరివ్ ఈ సినిమాకి యాక్షన్ కొరియోగ్రఫీని అందిస్తున్నట్లు సమాచారం. షూటింగ్ షెడ్యూల్లు, నటీనటులు మరియు ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు మూవీ మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.