డ్రగ్స్ కేసులో తన పేరుపై హీరో నవదీప్ స్పందించారు. తాను ఎక్కడికీ వెళ్లలేదని, హైదరాబాద్‌లోనే ఉన్నానని చెప్పారు. పోలీసులు ఏ నవదీప్ పేరు చెప్పారో తనకు తెలియదని, ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని నవదీప్ మీడియాకు తెలిపారు. తాను పరారీలో ఉన్నానని పోలీసులు అబద్ధాలు చెప్పారని, తాను పరారీలో ఉండాల్సిన అవసరం లేదన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa