ప్రభాత్ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాత ప్రదీప్ కుమార్. ఎం ‘ఏందిరా ఈ పంచాయితీ’ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో గంగాధర.టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. భరత్, విషికా లక్ష్మణ్‌లు ఈ చిత్రంతో హీరో హీరోయిన్లుగా ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి తాజాగా టీజర్‌ను విడుదల చేశారు. టీజర్ విషయానికి వస్తే.. 80 సెకన్ల నిడివి ఉన్న ఈ టీజర్లో అన్ని రకాల ఎమోషన్స్, యాక్షన్, కామెడీ, లవ్, థ్రిల్లర్ జానర్లను చూపించారు. అలాగే విలేజ్ బ్యాక్‌డ్రాప్, ఆర్టిస్ట్‌లు ఈ సినిమా కోసం మ్యాగ్జిమమ్ ఎఫెర్ట్ పెట్టినట్లుగా ఈ టీజర్ చూస్తుంటే తెలుస్తుంది.