రాబి వర్గీస్ రాజ్ దర్శకత్వంలో మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి 'కన్నూర్ స్క్వాడ్' అనే టైటిల్‌ను మూవీ మేకర్స్ ఖరారు చేసారు. తాజాగా ఇప్పుడు ఈ సినిమా సెన్సార్ ఫార్మాలిటీస్ ని పూర్తి చేసుకొని యు/ఎ సర్టిఫికేట్‌ను పొందినట్లు చిత్ర నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు.
ఈ చిత్రం సెప్టెంబర్ 28, 2023న థియేటర్లలోకి రానుంది. కిషోర్, సన్నీ వేన్, విజయరాఘవన్, రోనీ డేవిడ్ రాజ్, అజీజ్ నెడుమంగడ్, శబరీష్ వర్మ, శరత్ సభ మరియు ఇతరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఈ సినిమాకి రోనీ డేవిడ్ రాజ్ మరియు మహమ్మద్ షఫీ స్క్రీన్ ప్లే మరియు డైలాగ్స్ రాస్తున్నారు. సుసిన్ శ్యామ్ సంగీతం అందించనున్నారు. ఈ చిత్రాన్ని మమ్ముట్టి కంపానీ బ్యానర్‌పై నిర్మించారు.