కోలీవుడ్ సూపర్ స్టార్ అజిత్ తన 62వ ప్రాజెక్ట్ ని యువ తమిళ దర్శకుడు మగిజ్ తిరుమేనితో చేస్తున్నట్లు అధికారకంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి 'విదా ముయార్చి' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. తాజా అప్డేట్ ప్రకారం, ఈ సినిమాలో అజిత్‌తో స్టార్ హీరోయిన్ త్రిష మరియు హిందీ నటి హుమా ఖురేషి స్క్రీన్ స్పేస్‌ను పంచుకోనున్నట్లు సమాచారం. త్వరలోనే మూవీ టీమ్ నుంచి ఈ విషయం గురించి అధికారక ప్రకటన వెలువడనుంది.
అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ బిగ్గీ అక్టోబర్ నుంచి సెట్స్ పైకి వెళ్లనుందని వార్తలు వినిపించాయి. ఈ సినిమాలో హిందీ నటుడు సంజయ్ దత్ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. కోలీవుడ్ హిట్ మెషిన్ అనిరుధ్ రవిచందర్ ఈ హై బడ్జెట్ ఎంటర్టైనర్కు సంగీతం అందిస్తున్నారు. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ప్రాజెక్ట్‌ని లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది.