తమిళ స్టార్ హీరో విజయ్ ఆంటోని కుమార్తె మీరా మృతితో కోలీవుడ్ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఈ క్రమంలో కోలీవుడ్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రముఖుల మృతి ఘటనల్లో ఇక నుంచి మీడియాను అనుమతించబోమని నిర్మాతల సంఘం ప్రకటించింది. మరణించిన వారికి నివాళులర్పించేందుకు వచ్చే సెలబ్రిటీలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతకు ముందు నటుడు మరిముత్తు మరణించిన సమయంలోనూ మీడియా తీరు వివాదాస్పదమైంది.