ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా, హీరోయిన్ పరిణీతి చోప్రాల పెళ్లికి అంతా సిద్దమైంది. రాజస్థాన్- ఉదయ్‌పూర్ కోటలోని లీలా ప్యాలెస్‌లో వీరి వివాహం ఈ నెల 24న గ్రాండ్‌గా జరగనుంది. అంతకు ముందే హల్దీ, మెహందీ, సంగీత్ 23న జరగనున్నాయి. ఈ సందర్భంగా రాఘవ్- పరిణీతి ఉదయ్‌పూర్ చేరుకున్నారు. ప్రస్తుతం వారికి సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.