ప్రముఖ నటి అనుష్క, నవీన్ పొలిశెట్టి ప్రధాన పాత్రలో పి.మహేశ్ బాబు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మిస్ శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి ఓటీటీలోకి రానుంది. కామెడీతో ప్రేక్షకులను అలరించిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో సందడి చేయనుంది. అక్టోబర్ 5 నుంచి ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ వేదికగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తాజాగా నెట్ ఫ్లిక్స్ ఒక ప్రకటనలో తెలిపింది.