మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో, మైత్రీ మూవీ మేకర్స్, వృద్థి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రానికి 16వ వర్కింగ్ టైటిల్ రూపొందించారు. ఇటీవల ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టారు. తాజాగా ఈ చిత్రానికి బాలీవుడ్‌కి చెందిన స్టార్ హీరోయిన్ కుమార్తె ఈ చిత్రంలో రామ్‌చరణ్‌కు జోడీగా నటించబోతోందని తెలుస్తోంది. బాలీవుడ్‌లో స్టార్ హీరోయినగా గుర్తింపు తెచ్చుకున్న రవీనా టాండన గురించి పరిచయం అక్కర్లేదు.ఇప్పుడామె కుమార్తె రాషా థడానీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టేందుకు సిద్థమయ్యారు. ఇప్పటికే హిందీలో ఓ సినిమా అంగీకరించిన ఆమె తాజాగా రామ్‌చరణ్16 కోసం రంగంలో దిగినట్లు తెలిసింది. ఈ మేరకు కథా చర్చల కోసం ఆమె హైదరాబాద్ వచ్చినట్లు,లుక్ టెస్ట్ కోసమే ఆమె హైదరాబాద్ వచ్చారని పలు వీడియోలు వైరల్ అవుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa