తమిళ చిత్ర పరిశ్రమలోని నటీమణులైన శృతి పెరియస్వామి, నిరంజన నైదియర్ లెస్బియన్లుగా ‘వాళ్వు తొడంగుమిడం నీదానే’ అనే చిత్రంలో ముస్లిం, హిందూ యువతులుగా నటించారు. షార్ట్‌ఫ్లిక్స్ అనే ఓటీటీ సంస్థతో కలిసి నటి నీలిమ ఇసై దీన్ని నిర్మించారు. ఈ చిత్రం ప్రస్తుతం ఓటీటీలో సెన్సేషన్‌ని క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రంలో లెస్బియన్లుగా నటించడానికి గల కారణాలను శృతి పెరియస్వామి వివరిస్తూ... ‘ఈ చిత్ర కథను డైరెక్టర్ వివరించిన తీరు నచ్చింది. ఎందుకంటే నేను రాణించే మోడలింగ్ రంగంలో అనేక మంది తమ ప్రతిభను నిరూపించుకునేందుకు జీవన పోరాటం చేస్తున్నారు. ఈ రంగంలో ఉండే అనేక మంది లెస్బియన్స్‌గా జీవిస్తున్నారు. అందుకే ఈ పాత్రలలో నటించాలని తీర్మానించుకున్నా’ అని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa