విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై కొమ్మాలపాటి శ్రీధర్ సమర్పణలో తెరకెక్కుతున్న ‘అలా నిన్ను చేరి’తో మారేష్ శివన్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఈ చిత్రానికి కొమ్మాలపాటి సాయి సుధాకర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో యంగ్ హీరో దినేష్ తేజ్, అందాల తార హెబ్బా పటేల్ జంటగా నటిస్తున్నారు. సినిమాను త్వరలోనే విడుదల చేయబోతున్న క్రమంలో ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్, గ్లింప్స్, హీరో బర్త్ డే స్పెషల్ పోస్టర్‌లకు మంచి రెస్పాన్స్ రాగా.. ఆ మధ్య రిలీజ్ చేసిన ‘అలా నిన్ను చేరి’ టైటిల్ సాంగ్ యూట్యూబ్‌లో ట్రెండ్ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీ నుంచి మంచి మాస్ బీట్ సాంగ్ ‘కోడి బాయె లచ్చమ్మదీ’ ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేతుల మీదుగా మేకర్స్ విడుదల చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa