టీమ్ ఇండియా మాజీ కెప్టెన విరాట్ కోహ్లీ, బాలీవుడ్ బ్యూటీ అనుష్కశర్మ 2017లో మూడుముళ్ల బంధంతో ఒకటయ్యారు. 2021లో ఈ దంపతులు వామిక అనే బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే! ఇప్పుడు ఈ జంట మరోసారి తల్లిదండ్రులు కాబోతున్నారనే వార్త నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఆ గుడ్‌న్యూస్ త్వరలోనే బయటకు రాబోతుందనే వార్త కూడా వైరల్ అవుతోంది. అనుష్క ప్రస్తుతం గర్భవతి అని సోషల్ మీడియాలో వార్తలు ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ విషయంపై అనుష్క, విరాట్ కోహ్లీ ఎక్కడ ప్రకటించలేదు. త్వరలోనే ఈ వార్త బయటకు వస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. నవంబర్ 5న విరాట్ పుట్టినరోజు సందర్భంగా ఈ శుభవార్తను అభిమానులతో పంచుకుంటారని భావిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa