రక్షిత్ శెట్టి, రుక్మిణీ వసంత్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘సప్త సాగరాలు దాటి’. హేమంత్ ఎం రావు దర్శకత్వం వహించారు. పవిత్ర లోకేశ్, అవినాష్, అచ్యుత్ కుమార్‌లు కీలక పాత్రల్లో కనిపించారు. ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకొచ్చింది. మనసుకు హత్తుకునే ప్రేమకథగా ప్రేక్షకులను అలరించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించినంత వసూళ్లు రాబట్టలేదు. ఇంకా 10 రోజులు కూడా గడవక ముందే ఈ చిత్రం సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. కన్నడలో రూపొందిన ఈ చిత్రం తెలుగు, తమిళం, మలయాళం, హిందీలోనూ ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa