ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మంచి మనస్సు చాటుకున్న సూర్య

cinema |  Suryaa Desk  | Published : Sun, Oct 01, 2023, 01:36 PM

తమిళ హీరో సూర్య అభిమాని ఒకరు తాజాగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న సూర్య అతడి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. చెన్నైలోని ఎన్నూర్‌లో నివసించే అరవింద్‌.. హీరో సూర్యకు వీరాభిమాని. సూర్య ఫ్యాన్స్‌ క్లబ్‌లో కొన్నేళ్లుగా మెంబర్‌గా ఉన్నాడు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో అరవింద్‌ మరణించారు. ఈ విషయం తెలుసుకున్కన సూర్య వెంటనే అరవింద్‌ ఇంటికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. తల్లిదండ్రులతో మాట్లాడి ఓదార్చారు. వారితో ధైర్యాన్ని నింపారు. తాజాగా ఆ ఫొటోలు బయటకు రావడంతో ఆయనపై మరింత అభిమానం, గౌరవం పెరిగింది అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. గతంలోనూ సూర్య అభిమాని ఒకరు మరణిస్తే ఆ కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa