రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న సినిమా 'డబల్ ఇస్మార్ట్'. ఈ సినిమాకి డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఇస్మార్ట్ శంకర్ మూవీకి సీక్వెల్ గా రానుంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన సంగీత దర్శకుడిని చిత్ర బృందం ప్రకటించింది. ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందించబోతున్నట్లు చిత్రబృందం అధికారికంగా తెలియజేస్తూ పోస్టర్‌ను కూడా విడుదల చేసింది. అంతే కాకుండా ఈ మూవీకి మణిశర్మ సంగీతం అందించబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించడంతో ఈ సినిమా సంగీతంపై కూడా ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa