సుధీర్ బాబు హీరోగా నటించిన సినిమా 'మామ మచ్చింద్ర'. ఈ సినిమాకి హర్ష వర్ధన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ఈషా రెబ్బా, మృణాళిని రవి హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండగా.. ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ తేదీని, వెన్యూని ఖరారు చేస్తూ పోస్టర్‌ను రిలీజ్ చేసింది చిత్రబృందం. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని అక్టోబర్ 2న హైదరాబాద్‌లోని జెఆర్‌సి కన్వెన్షన్‌లో నిర్వహించనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమా అక్టోబర్ 6న థియేటర్లలోకి రానుంది. ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై నారాయణ్ దాస్ కె. నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు నిర్మించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa