భరత్, విషికా లక్ష్మణ్ జంటగా ప్రభాత్ క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రదీప్ కుమార్.ఎం నిర్మించిన చిత్రం ‘ఏందిరా ఈ పంచాయితీ’ . ఈ మూవీతో గంగాధర.టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. విలేజ్ లవ్ ఎమోషనల్ డ్రామాగా ఈ చిత్రం అక్టోబర్ 6న గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు ముస్తాబవుతోంది. ఇందులో సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌ను కూడా చూపించబోతోన్నట్టుగా తాజాగా వదిలిన ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. ఈ చిత్ర ట్రైలర్‌ను హీరో శ్రీకాంత్ చేతుల మీదుగా మేకర్స్ తాజాగా విడుదల చేశారు. ట్రైలర్ విడుదల అనంతరం హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ.. ట్రైలర్ చాలా బాగుంది. కొత్త టీమ్ ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించింది. సినిమా టీమ్‌కు ఆల్ ది బెస్ట్. ఈ మూవీ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నానని అన్నారు.