మహేష్ బాబు హీరోగా దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘గుంటూరు కారం’ హారికా అండ్ హాసిని క్రియేషన్స పతాకంపై ఎస్.రాధాకృష్ణ (చిన్నబాబు) నిర్మిస్తున్నారు. ప్రారంభమై చాలా కాలమైనా సినిమా ఓ కొలిక్కి రాలేదు. ఈ మధ్యనే కాస్త వేగంగా చిత్రీకరణ జరుగుతోంది. అయితే ఈ సినిమాపై వచ్చినన్ని రూమర్స్ ఈ మధ్య కాలంలో ఏ సినిమాకు రాలేదు. మహేష్ మాటిమాటికి ఫ్యామిలీ టూర్స్ వేయడం వల్ల డిలే అవుతుందని గుసగుసలు వినిపించాయి. తర్వాత కథ మారిందని, రీషూట్ చేశారని, సంగీత దర్శకుడు తప్పుకొన్నాడని టాక్ నడిచింది. కొన్నాళ్లకు ఆరిస్ట్‌లు, సాంకేతిక నిపుణుల్లో మార్పు జరిగాయి. పాత వాళ్లు బయటకు వెళ్లిపోవడం మళ్లీ కొత్తవాళ్లు రీప్లేస్ కావడం జరిగింది. అలాగే హీరోయిన పూజాహెగ్డే కూడా పలు కారణాలతో ఈ చిత్రం నుంచి బయటకు వెళ్లింది. ఇప్పటికే ఈ విషయాలపై నిర్మాత సూర్యదేవర నాగవంశీ స్పందించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన మరోసారి రూమర్స్‌ను ఖండించారు. పూజా హెగ్డే ఈ చిత్రంలో ఎందుకు నటించడంలేదో చెప్పుకొచ్చారు. ‘‘గుంటూరు కారం’ చిత్రాన్ని ఆగస్టులో విడుదల చేద్దామనుకున్నాం. తర్వాత 2024 జనవరి 12కు మార్చాం. దాంతో కంగారులేకుండా నెమ్మదిగా షూటింగ్ చేయాలనుకున్నాం. అదే సమయంలో పూజా హెగ్డే మరో హిందీ చిత్రంలో నటించాల్సి వచ్చింది. డేట్స్ సర్దుబాటుకాకపోవడంతో ఆమెను రీప్లేస్ చేశాం. దానికే కొందరు నానా హంగామా చేశారు. అంత చేయాల్సిన అవసరం ఏముందో నాకు ఇప్పటికీ అర్థంకాదు. పండగ సీజన్ కు రావాల్సిన సినిమాలో ఏయే అంశాలు ఉండాలో అవన్నీ ఇందులో ఉన్నాయి. మహేశ్ బాబు క్యారెక్టర్ విభిన్నంగా ఉంటుంది. ప్రస్తుతానికి రెండు సాంగ్స్ రెడీ అయ్యాయి. ఫస్ట్ సింగిల్ త్వరలోనే విడుదల చేస్తాం. సంక్రాంతికి పక్కా ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం. అందులో ఎలాంటి సందేహం లేదు’’ అని స్పష్టం చేశారు.