'తొలిప్రేమ’ చిత్రం పేరు చెప్పగానే పవన్ కల్యాణ్ ఎలాగైతే గుర్తొస్తారో.. అందులో అను పాత్రధారి కీర్తిరెడ్డి కూడా అంతే గుర్తొస్తుంది. ఈ చిత్రంలో ఆమె నటన ఎంతగా ఆకట్టుకుంటో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. గన్ షాట్‌తో హీరోయినగా పరిచయమై ప్రేమించే మనసు, రావోయి చందమామ చిత్రాల చేసిన కీర్తిరెడ్డి విజయం వరించలేదు. ఆ తర్వాత మహేశ నటించిన 'అర్జున’లో మీనాక్షిగా మహేష్‌కు సోదరి పాత్ర పోషించింది. ఈ చిత్రాలన్నీ నిరాశే మిగిల్చాయి. గన్ షాట్, తొలిప్రేమ చిత్రాల తర్వాత ఆమె కెరీర్ తిరుగు ఉండదు అనుకున్నారు. ఆ తర్వాత చేసిన చిత్రాలేమీ ఆమెకు కలిసి రాలేదు. దాంతో వెండితెరకు దూరమైంది. తాజాగా కీర్తిరెడ్డి వెండితెరపై మెరవబోతోందని వార్తలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. కీర్తిరెడ్డి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాలని భావిస్తున్నట్లు సమాచారం. నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు, లీడ్ క్యారెక్టర్స్ కోసం కీర్తి వేట మొదలుపెట్టిందట. ఇప్పటికే పలువురు దర్శకుడు ఆమెను అప్రోచ్ అయ్యారని తెలిసింది. అయితే ఆ కథలతో ఆమె అంతగా సంతృప్తి చెందలేదని టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది.