సూపర్‌స్టార్ రజనీకాంత్ ‘జైలర్’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ‘తలైవర్ 170’ అనే వర్కింగ్ టైటిల్‌తో సినిమా ఈరోజు పూజాకార్యక్రమంతో మొదలైంది. త్రివేండ్రంలో కథానాయకుడు రజనీకాంత్, దర్శకుడు మిగతా సాంకేంతిక నిపుణులు ఈ పూజకు హాజరయ్యారు. ఇది ఒక పెద్ద మల్టీ స్టారర్ సినిమా గా తయారవుతోంది. ఇందులో అమితాబ్ బచ్చన్ ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నారు, అలాగే మలయాళం నటుడు ఫహద్ ఫాజిల్ కూడా వున్నారు. తెలుగు నుండి భల్లాలదేవుడు రానా దగ్గుబాటి ఈ సినిమాలో ఇంకో ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు అని చిత్ర యూనిట్ అధికారికంగానే చెప్పింది. ఇక అనిరుద్ రవిచందర్ దీనికి సంగీతం సమకూరుస్తున్నాడు. ఇవన్నీ ఇలా ఉంటే, ఇందులో ముగ్గురు హీరోయిన్లకు నటించే అవకాశం కల్పించారు. వీరిలో ఒకరు మాలీవుడ్‌కు చెందిన మంజు వారియర్, కోలీవుడ్‌కు చెందిన దుషార విజయన్ , బాలీవుడ్‌కు చెందిన రితికా సింగ్ ఉన్నారు.