మాస్ హీరో రవితేజ నటించిన ‘టైగర్ నాగేశ్వరరావు’ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకలో వి. విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. ఈ సినిమా ట్రైలర్ చూశాను. ప్రతి ఫ్రేమ్ నన్ను ఆ ప్రపంచంలోకి తీసుకెళ్ళింది. నాగేశ్వరరావు చనిపోయాడు టైగర్ పుట్టాడు అనే మాట నన్ను చాలా కదిలించింది. దర్శకుడు వంశీకి కాల్ చేసి అభినందించాను. వంశీకి చాలా మంచి భవిష్యత్ వుంటుంది. రవితేజ గారికి ఒక విన్నపం. విక్రమార్కుడు సినిమాని హిందీ, తమిళం, కన్నడలో చేశారు. కానీ రవితేజ గారిని ఎవరూ మ్యాచ్ చేయలేదు. రవితేజగారు కేవలం తెలుగు సినిమాకే పరిమితం కాకూడదు. భారతదేశ కీర్తి పతాకాలు ఎగరేయాలని కోరుకుంటున్నాను అని అన్నారు.