టాలీవుడ్ హీరోయిన్ మెహ్రీన్ కీలక వ్యాఖ్యలు చేసింది. ఆమె 'సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ' అనే వెబ్ సీరీస్ లో నటించింది. కథ ప్రకారం భార్యను భర్త బలాత్కరించే సన్నివేశం ఉండగా వెబ్సైట్లు, కొంతమంది నెటిజన్లు దాన్ని శృంగార సన్నివేశంగా పేర్కొనడాన్ని మెహ్రీన్ ఖండించారు. అది ఎంతోమంది మహిళలు ఎదుర్కొంటున్న సమస్య అంటూ ఆమె ట్వీట్ చేశారు. సమస్యను కూడా ఈ కోణంలో చూడటం చాలా బాధాకరమని మెహ్రీన్ ఆవేదన వ్యక్తం చేశారు.