విజయ్ 'లియో' సినిమాకు ఆల్ ది బెస్ట్ చెబుతూ తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ ట్వీట్ చేశారు.. ఆయన ట్వీట్ లో ఆయన ఎల్సీయూ అంటూ హ్యాష్ ట్యాగ్ ఇవ్వడంతో లోకేశ్ కనగరాజ్ ఫ్యాన్స్ లో జోష్ వచ్చింది. ఇందుకు కారణం. ఖైదీ, విక్రమ్ సినిమాలను ఇప్పటికే లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్ (LCU) లో భాగం కాగా.. లియో కూడా అందులోనిదేనా కాదా అన్న సందేహాలున్నాయి. తాజాగా ఉదయనిధి ట్వీట్ తో అది కన్ఫామ్ అయిందంటూ ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.