స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధత కల్పించలేమని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై మంచి లక్ష్మి ట్విట్టర్ ద్వారా స్పందించారు. 'సుప్రీంకోర్టు తీర్పుపై నేను చాలా నిరాశగా ఉన్నాను. దీని గురించి రాస్తున్నప్పుడు నా గుండె పగిలిపోయింది. అన్ని రకాల ప్రేమలను స్వీకరించి, మిగతా ప్రపంచానికి ప్రేమ గురించి బోధించిన దేశానికి ఇది నిజమైన అవమానం.. అయినప్పటికీ దాని స్వంత దేశంలో దీనిని తిరస్కరించారు' అని ట్వీట్ చేశారు.