దళపతి విజయ్, లోకేష్ కాంబినేషన్ లో తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రం 'లియో' HD ప్రింట్ లీక్ అయింది. HD ప్రింట్ ను ఆన్ లైన్ లో చూసిన విజయ్ ఫ్యాన్స్, సినీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రీమియర్ షో పూర్తయిన కొద్దిసేపటికే HD ప్రింట్ ఆన్ లైన్ లో ప్రత్యక్షం అవడమేంటని మండిపడుతున్నారు. లీక్ చేసిన వారిని గుర్తించాలని, ఆన్ లైన్ నుంచి తొలగించాలని అభిమానులు ఫైర్ అవుతున్నారు.