రానున్న సంక్రాంతి పండగకు టాలీవుడ్ లో పోటీ ఉండొచ్చు అని పరిశ్రమలో టాక్ నడుస్తోంది. ఎందుకంటే ఈసారి చాలా సినిమాలు సంక్రాంతి పండగకు తేదీలు అధికారికంగా ప్రకటించారు. అయితే ప్రభాస్ నటిస్తున్న 'సలార్' డిసెంబర్ 22వ తేదీ విడుదలవుతుండటంతో, ఆరోజు విడుదల కావాలసిన కొన్ని సినిమాలు కూడా సంక్రాంతి పండగ పోటీలో ఉండటం విశేషం. ముందుగా మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వస్తున్న 'గుంటూరు కారం' జనవరి 12న విడుదల అని అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది. చాలా భాగం అయిపొయింది అని కూడా అంటున్నారు, కేవలం, క్లైమాక్స్ సన్నివేశాలు, నాలుగు పాటలే మిగిలి వున్నాయి, అందుకని ఈ సినిమా సంక్రాంతి పదంగాకి ఖాయం అని అంటున్నారు. అలాగే ఇంకో సినిమా 'నా సామి రంగా' . నాగార్జున నటిస్తున్న ఈ సినిమాకి విజయ్ బిన్ని దర్శకుడు, ఈ సినిమా కూడా ఒక్కరోజు గ్యాప్ ఇవ్వకుండా షూటింగ్ జరుగుతోంది అని తెలిసింది. ఇది కూడా సంక్రాంతి పండగకి ఖాయం అని అంటున్నారు. అలానే వెంకటేష్ నటిస్తున్న చిత్రం కూడా సంక్రాంతికే రాబోతుంది. తాజాగా విజయదేవరకొండ చిత్రం కూడా సంక్రాంతికి వస్త్తున్నట్లు ప్రకటించారు. మరి వీటిలో ప్రజల మనస్సు గెలుచుకునేది ఎవరో చూడాలి.