కన్నడ నటుడు శివరాజ్‌కుమార్ తాజాగా నటించిన ‘ఘోస్ట్’ సినిమా ప్రచారంలో భాగంగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో 'జైలర్' గురించి మాట్లాడారు. ఆ చిత్రంలో కీలక పాత్ర పోషించి మెప్పించడం గొప్ప విషయమని పేర్కొన్నారు. ‘‘జైలర్’లో నేను పోషించిన నరసింహ క్యారెక్టర్‌కు అంత గుర్తింపు వచ్చిందంటే దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ కారణం. వాస్తవానికి నరసింహలాంటి రోల్‌ని నేను ఊహించలేదు. ఇదొక సర్ప్రైజ్. ఈ చిత్రంలో ‘మీరేం చేశారు?.. ఎందుకింత స్పందన?’ అంటూ ఓ రోజు నా భార్య ఆశ్చర్యం వ్యక్తం చేసింది. నాకూ తెలియదని జవాబు చెప్పా. ప్రేక్షకులకు ఎప్పుడు, ఏది నచ్చుతుందో చెప్పలేం. నెగెటివ్ రోల్లో నటించాల్సి వస్తే యాక్షన్ నేచురల్‌గా వస్తుందిఅని అన్నారు. శివ రాజ్‌కుమార్ హీరోగా దర్శకుడు ఎంజీ శ్రీనివాస్ తెరకెక్కించిన ‘ఘోస్ట్’ కన్నడలో ఈ నెల 19న విడుదలైంది. 27న తెలుగులో విడుదల కానుంది.