నేషనల్ క్రష్ రష్మిక పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుని వరుస సినిమాలతో బిజీగా ఉంటోంది. కాగా తాజాగా ఇంస్టాగ్రామ్ లో ఆసక్తికర పోస్ట్ చేసింది రష్మిక. తను ట్రావెలింగ్ ను చాలా మిస్ అవుతున్నానంటూ 'ప్రయాణం మీ జ్ఞానాన్ని, మనస్సును ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది.ఈ ట్రావెల్ లో ప్రతిది గొప్ప అనుభూతి.. చాలా మిస్ అవుతున్నాను అంటూ రాసుకొచ్చింది. దీంతో ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.