డీజే టిల్లు సినిమా ద్వారా ఎంతో పాపులర్ అయిన హీరో సిద్దు జొన్నలగడ్డ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని తెలుస్తుంది. ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్న సిద్దు ఒక హీరోయిన్ ప్రేమలో పడ్డారని సమాచారం. ఈ ప్రేమ విషయాన్ని తన కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో వాళ్లు కూడా ఈ ప్రేమ పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తుంది. సిద్దు కూడా హీరోయిన్ ని పెళ్లి చేసుకోబోతున్నారనే విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మరి ఇందులో ఎంతవరకు నిజముందో త్వరలోనే తెలియనుంది.