యంగ్ హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ సంప్రదాయ దుస్తుల్లో పద్ధతిగా మెరిసి ఆకట్టుకుంటోంది. చీరకట్టులో అందంగా దర్శనమిచ్చి మంత్రముగ్ధులను చేసింది. లేటెస్ట్ పిక్స్ లో చూపుతిప్పుకోకుండా చేసింది.టాలీవుడ్ యంగ్ హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ చివరిగా రవితేజ సరసన ‘రావణసుర’ చిత్రంలో నటించింది. ఈ సినిమాతో పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో నెక్ట్స్ సినిమాలపై ఫోకస్ పెట్టింది. తెలుగులో నటించిన చిత్రాలతో అను ఇమ్మాన్యుయేల్ కు మంచి గుర్తింపే దక్కింది. బడా హీరోలతో నటించే ఛాన్స్ వచ్చినప్పటికీ స్టార్ హీరోయిన్ గా మారలేకపోయింది. ఆమె నటించిన చిత్రాలు అంతంత మాత్రానే ఆడటంతో సెకండ్ గ్రేడ్ హీరోయిన్ గానే మిగిలిపోయిది.టాలీవుడ్ లోకి ఈ ముద్దుగుమ్మ ‘మజ్ను’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’, ‘ఆక్సిజన్’, ‘నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా’, ‘శైలాజా రెడ్డి అల్లుడు, ‘మహా సముద్రం’, ‘ఊర్వసివో రాక్షసివో‘ వంటి సినిమాలు చేసింది. ఈ బ్యూటీ నటించిన చిత్రాలతో సక్సెస్ రేట్ తక్కువగా ఉందనే చెప్పాలి. దీంతో ప్రస్తుతం సినిమా ఆఫర్లు తగ్గాయి. బడా హీరోలతో కాకుండా సెకండ్ గ్రేడ్ హీరోలతో నటిస్తూ వెండితెరపై మెస్మరైజ్ చేస్తోంది. ఇదిలా ఉంటే.. అను ఇమ్మమాన్యుయేల్ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గానే కనిపిస్తోంది. తన బ్యూటీఫుల్ గ్లామర్ ఫొటోలను పంచుకుంటూ ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలో తాజాగా ఈ ముద్దుగుమ్మ చీరకట్టులో దర్శనమిచ్చింది. ఎర్రచీరలో ఇమ్మాన్యుయేల్ బ్యూటీఫుల్ లుక్ ను సొంతం చేసుకుంది. చీరకట్టుకే అందం తెచ్చిందీ ముద్దుగుమ్మ. తన గ్లామర్ మెరుపులతో మెస్మరైజ్ చేసింది. మత్తు ఫోజులతో మతులు పోగొట్టింది.తాజాగా పంచుకున్న ఫొటోస్ కు కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ‘జపాన్’ చిత్రంలో నటిస్తోంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది.
At Japan Trailer Launch
Enchanting _ A n u E m m a n u e l #AnuEmmanuel @ItsAnuEmmanuel pic.twitter.com/o0GDQAc7gV
— Only Heroines (@OnlyHeroines) October 30, 2023