తను రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు వచ్చిన వార్తలపై నటి ప్రగతి క్లారిటీ ఇచ్చారు. ఓ నిర్మాతను ఆమె పెళ్లాడబోతున్నట్లు ఓ ప్రముఖ న్యూస్ వెబ్ సైట్ వార్త రాయగా దీనిపై ప్రగతి చాలా ఘాటుగా స్పందించారు. అందులో ఏమాత్రం నిజం లేదని స్పష్టం చేసింది. తాను కేవలం ఓ నటి అన్న కారణంతో ఏది పడితే అది రాసేస్తారా అంటూ సదరు పత్రికపై మండిపడింది. తన రెండో పెళ్లి పుకార్లపై స్పందిస్తూ ప్రగతి ఓ వీడియో రిలీజ్ చేసింది.