ప్రముఖ హాలీవుడ్ నటి, యూఎన్హెచ్ఆర్సీ మాజీ అంబాసిడర్ ఏంజెలీనా జోలి ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంపై స్పందించారు. గాజా ప్రజలపై ఇజ్రాయెల్ ప్రతీకార చర్యలకు పాల్పడుతోందని, జబాలియాలోని శరణార్థుల అపార్ట్మెంటుపై 2 రోజులక్రితం జరిగిన వైమానిక దాడిని ఉద్దేశించి ఈ వాఖ్యలు చేశారు. అది నిస్సాహయతలో ఉన్న జనాభాపై ఉద్దేశపూర్వకంగా చేసిన దాడి అంటూ విమర్శించారు. దీనికి ఇజ్రాయెల్ బాధ్యతవహించాలని సోషల్ మీడియా వేదికగా చెప్పారు.