నవంబర్ 1న ఇటలీలో జరిగిన వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠీల పెళ్లిలో మెగా ఫ్యామిలీ మొత్తం ఒకే చోట చేరి సంతోషకర సమయాన్ని గడిపింది. పెళ్లి వేడుక సందర్భంగా మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కల్యాణ్, నాగబాబుల ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఫొటోను నాగబాబు ఇన్స్టా వేదికగా షేర్ చేశాడు. " తమ మధ్య బేదాభిప్రాయాలు, వాదనలు ఉన్నప్పటికీ. తమ అనుబంధం ఎంతో ప్రత్యేకమైనది. ఆ అనుబంధం తాము చేసిన పనులకు, వాటి జ్ఞాపకాలకు చెందినది మాత్రమే కాదని. అది ఎంతో లోతైన బంధమని అన్నారు. తమది విడదీయలేని అనుబంధమని" భావోద్వేగంతో కూడిన పోస్ట్ పెట్టారు.