నందమూరి కల్యాణ్‌రామ్ నటిస్తున్న తాజా చిత్రం ‘డెవిల్’. నవీన్ మేడారం దర్శకుడు. ‘బింబిసార’ చిత్ర విజయం తర్వాత కల్యాణ్‌రామ్ చేస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. ఎవరికీ అంతు చిక్కని రహస్యాన్ని ఛేదిస్తూ ఓ బ్రిటీష్ ఏజెంట్ చేసే ప్రయాణం ఈ చిత్రం. ఇందులో ఆ ఏజెంట్ పాత్రను కల్యాణ్‌రామ్ పోషిస్తున్నారు. షూటింగ్ పార్ట్ పూర్తయిన ఈ చిత్రాన్ని ఈ నెల 24న విడుదల చేయాలని నిర్మాతలు భావించారు. అయితే సినిమాలో కీలకం అయిన వీఎఫ్ఎక్స్ పనుల్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఆలస్యమవుతున్నాయి. అందుకే రిలీజ్‌ను వాయిదా వేస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా నిర్మాతలు ప్రకటించారు. ‘థియేటర్లలో అద్భుతమైన అనుభూతిని ఇవ్వడం కోసం మా టీమ్ ఎంతో కృషి చేస్తోంది.సాంకేతిక కారణాల వల్ల విడుదలను వాయిదా వేస్తున్నాం. కొత్త తేదినీ త్వరలో ప్రకటిస్తాం’ అని నిర్మాతలు పేర్కొన్నారు. ఈ చిత్రంలో కల్యాణ్‌రామ్ సరసన సంయుక్త మీనన్ నటిస్తున్నారు.