'మా ఊరి పొలిమేర' సినిమా విజువల్స్ చాలా బాగుండటం, సినిమాలో అక్కడక్కడా మంచి త్రిల్లింగ్ పాయింట్స్ ఉండటం, ఓటిటి లో వచ్చిన సినిమా మంచి హిట్ అవటంతో ప్రేక్షకులు 'మా ఊరి పొలిమేర2'సినిమా మీద ఎక్కువ ఆసక్తి చూపించినట్టుగా తెలిసింది. ఆ సినిమా థియేటర్ హక్కులు సుమారు రూ .4 కోట్లకి అమ్ముడు అయ్యాయని తెలిసింది. ఈ సినిమా మొత్తం మూడు రోజులకి గాను రూ. 10 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ చేసిందని ట్రేడ్ అనలిస్ట్స్ అంటున్నారు. ఈ సినిమా అప్పుడే బ్రేక్ ఈవెన్ కూడా అయిపోయిందని, ఇప్పుడు లాభాల బాటలో ఉందని తెలుస్తోంది. సత్యం రాజేష్ నటన, అలాగే కథానాయిక అయిన కామాక్షి భాస్కర్ల అద్భుత ప్రతిభ కనపరిచిందని ఈ ఇద్దరూ సినిమాకి హైలైట్ అని అంటున్నారు.