ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆయనతో మా కుటుంబానికి స్నేహ సంబంధాలు ఉన్నాయి

cinema |  Suryaa Desk  | Published : Sat, Nov 11, 2023, 01:48 PM

చంద్ర మోహన్ గారు కన్ను మూశారని తెలిసి ఆవేదన చెందాను అని పవన్ కళ్యాణ్ అన్నారు. అయన మాట్లాడుతూ... ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఆయన్ని తెరపై చూడగానే మనకు ఎంతో పరిచయం ఉన్న వ్యక్తినో, మన బంధువునో చూస్తున్నట్లు అనిపించేది. కథానాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనదైన నటనను చూపించారు. పదహారేళ్ళ వయసు, సిరిసిరి మువ్వ, సీతామాలక్ష్మి, రాధా కళ్యాణం లాంటి చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించారు. 'షిర్డీ సాయిబాబా మహత్యం'లో నానావళిగా గుర్తుండిపోయే పాత్ర చేసారు, ఆయనతో మా కుటుంబానికి స్నేహ సంబంధాలు ఉన్నాయి.అన్నయ్య చిరంజీవి గారితో కలిసి చంటబ్బాయి, ఇంటిగుట్టు లాంటి చిత్రాల్లో నటించారు. నా మొదటి చిత్రం అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయిలో మంచి పాత్ర పోషించారు. తమ్ముడు చిత్రంలో మా ఇద్దరి మధ్య అలరించే సన్ని వేశాలుంటాయి. 900కి పైగా చిత్రాల్లో నటించిన అయన  తెలుగు ప్రేక్షకులలో అన్ని తరాలవారికి చేరువయ్యారు. చంద్రమోహన్ గారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను అని అన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com