అటు సినిమాలు, ఇటు వెబ్ సిరీస్, వెబ్ సినిమాలు చేసుకుంటూ చాలా బిజీగా వున్న నటీమణుల్లో తమన్నా ఒకరు. కొన్ని రోజుల క్రితం మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, నటి లావణ్య త్రిపాఠిలు ఇటలీలో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదే బాటలో నటి తమన్నా భాటియా వివాహం త్వరలో జరగబోతోంది అని టాక్. తమన్నా, హైదరాబాదుకి చెందిన నటుడు విజయ్ వర్మతో రిలేషన్ షిప్ లో వున్న సంగతి కూడా అందరికీ తెలిసిన విషయమే. మొదట్లో కొన్నాళ్ళు ఇద్దరూ దాచిన, తరువాత బహిరంగంగానే తాము ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతున్నట్టుగా చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు ఈ రిలేషన్ షిప్ ని వివాహం వరకు తీసుకు వెళ్లాలని ఆలోచిస్తున్నట్టుగా తెలిసింది. వచ్చే సంవత్సరం ఇద్దరూ వివాహం చేసుకోవాలని కూడా నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నట్టు ఒక వార్త నడుస్తోంది. 33 సంవత్సరాల తమన్నా ఇక వివాహం చేసుకోవాలని, అందుకోసం తాను ప్రేమిస్తున్న విజయ్ వర్మతో మాట్లాడి త్వరలోనే ఒక నిర్ణయం తీసుకోనుందని అంటున్నారు. అలాగే తమన్నా తల్లిదండ్రులు కూడా ఈ వివాహానికి తమ మద్దతు తెలిపినట్టుగా కూడా తెలిసింది.